ప్రతి కుటుంబం లో ఒక వ్యక్తిని డిజిటల్ అక్షరాస్యులు చేయుట "డిజిటల్ ఇండియా" యొక్క విజన్. దేశవ్యాప్తంగా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు 2019నాటికి డిజిటల్ అక్షరాస్యత కల్పించేందుకు ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్(పీఎండీడీఐఎస్ హెచ్ఏ)’ పథకాన్ని ప్రేవేశపెట్టరు. దీనిని ‘డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్’లో భాగంగా చేపట్టనున్నారు.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ‘డిజిటల్ అక్షరాస్యత’ కార్యక్రమంగా నిలువనుంది. ఈ ప్రాజెక్టును 2019 మార్చికల్లా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా 2.75 కోట్ల మందికి 2017–18లో, 3 కోట్ల మందికి 2018–19లో శిక్షణ అందించనున్నారు. 2.50లక్షల గ్రామపంచాయతీల్లో ఒక్కో గ్రామం నుంచి 200–300 మంది అభ్యర్థులను ఇందుకోసం ఎంపికచేయనున్నారు మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి