డిజిటల్ ఇండియా ఎలా గ్రహించబడుతుంది: డిజిటల్ ఇండియా పునాదులు డిజిటల్ ఇండియా అనేది వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను కలిగిన ఒకే గొడుగు కిందికి వచ్చే కార్యక్రమం. పెద్ద సంఖ్యలో ఆలోచనలను, భావాలను ఒక సమగ్రమైన దార్శనికతలోకి అల్లడం ద్వారా వాటిలో ఒక్కొక్కదానిని ఒక పెద్ద లక్ష్యంలో భాగంగా చేయవచ్చు. ప్రతి వ్యక్తిగత మూలకం తనంతతానుగా నిలబడుతున్నా ఓ పెద్ద దృశ్యంలో కూడా భాగంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంపూర్ణ సమన్వయంతో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రభుత్వం పూర్తిగా అమలు చేయాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియా బ్రాడ్‌బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టివిటీకి సార్వజనీన ప్రవేశం, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, ఇ-గవర్నెన్స్:సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వాన్ని సంస్కరించడం, ఇ-క్రాంతి, ఎలక్ట్రానిక్ మార్గంలో సేవల బట్వాడా, అందరికీ సమాచారం, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఉద్యోగాలకు ఐ.టి, త్వరిత దిగుబడి కార్యక్రమాలు మొదలైనవాటి వృద్ధికి సంబంధించిన తొమ్మిది పునాదులకు మరింత ఊతం ఇవ్వాలనే ఆశయంతో భారత్ ముందుకుసాగుతోంది. ఈ రంగాల్లోని ప్రతి అంశం తమంతతాముగా జటిలమైనవి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో ముడిపడి ఉంటాయి. అమలు పద్ధతి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద కీలకమైన ఐ.సి.టి మౌలిక వసతులను ఏర్పరచి, విస్తరించడం, సేవల బట్వాడా తదితరాలు సహా అన్ని ప్రయత్నాలు నిర్ధిష్ఠమైన గడువు లక్ష్యాలను కలిగి ఉంటాయి. చాలావరకు ప్రయత్నాలు మరో మూడేళ్లలోపు కార్యరూపం దాల్చేలా ప్రణాళిక రూపొందించారు. త్వరితగతిన పూర్తి చేసేలా ఆ ప్రయత్నాలకు (“సత్వర పంటకాపు కార్యక్రమాలు) ప్రణాళిక రూపొందించారు. పౌర కమ్యూనికేషన్ ప్రయత్నాలు (“అందరికీ సమాచారం”) ఇప్పటికే ప్రత్యక్షంగా కనిపిస్తూ, ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతమున్న పలు పథకాలను ఒక చోటుకు తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఉద్దేశ్యం. ఈ పథకాలు పునర్నిర్మించబడి, ప్రక్షాళన చేయబడి, కొత్తగా దృష్టి కేంద్రీకరించబడుతాయి. ఓ పద్ధతి ప్రకారం అది అమలు చేయబడుతుంది. అనేక మూలకాలు తక్కువ ఖర్చు ప్రభావాలతో చేసిన ప్రక్రియ మెరుగుదలలు మాత్రమే. డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాల ఉమ్మడి బ్రాండింగ్ తమ రూపాంతర ప్రభావాన్ని వెలుగులోకి తెస్తాయి. డిజిటల్ ఇండియా ద్వారా కోరుకున్న ఫలితాలను సాధించడం కోసం వినూత్నమైన పరిష్కారాలు కనుగొనేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేసే క్రమంలో ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు, పౌర సమాజం, పౌరుల మధ్య విస్తృత సంప్రదింపులు జరుగుతున్నాయి. "మై గవ్" అని పిలిచే డిజిటల్ ప్లాట్ఫారంను ఎలక్ట్రానిక్, ఐ.టి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రారంభించిందిhttp://mygov.in/) ద్వారా సహకార, భాగస్వామ్య పరిపాలనకు వీలు కల్పించబడింది. అంతేకాక, డిజిటల్ ఇండియా దార్శనిక రంగాల అమలు విధానం గురించి చర్చించడం కోసం పలు సంప్రదింపులు మరియు శిక్షణాశిబిరాలు నిర్వహించడమైనది. 1. బ్రాడ్‌బ్యాండ్ హైవేలు అందరికీ బ్రాడ్‌బ్యాండ్-రూరల్, అందరికీ బ్రాడ్‌బ్యాండ్-అర్బన్, నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎన్.ఐ.ఐ) పేరుతో మూడు ఉప విభాగాలున్నాయి. i) అందరికీ బ్రాడ్‌బ్యాండ్-రూరల్: నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కింద 2016 డిసెంబర్ నాటికల్లా 2.50,00 పంచాయతీలను తీసుకురానున్నారు. టెలీకమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ii) అందరికీ బ్రాడ్‌బ్యాండ్-అర్బన్: సేవా బట్వాడా కోసం వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్లకు బాధ్యతలు అప్పగించారు. కొత్త పట్టణ అభివృద్ధి కేంద్రాలు, భవనాలలో కమ్యూనికేషన్ మౌలిక వసతులు తప్పనిసరి చేయబడ్డాయి. iii) నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎన్.ఐ.ఐ): వివిధ ప్రభుత్వ శాఖల్లో పంచాయతీ స్థాయి వరకు హైస్పీడ్ కనెక్టివిటీ మరియు క్లోడ్ ప్టాట్ఫారంలను అందించడం కోసం ఎన్.ఐ.ఐ దేశంలోని నెట్వర్క్ మరియు క్లౌడ్ మౌలిక వసతులను కలుపుతుంది. స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (ఎస్.డబ్ల్యు.ఏ.ఎన్), నేషనల్ నాలెడ్జి నెట్వర్క్ (ఎన్.కె.ఎన్), నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ (ఎన్.ఓ.ఎఫ్.ఎన్), గవర్నమెంట్ యూజర్ నెట్వర్క్ (జి.యు.ఎన్), మేఘ్రాజ్ క్లౌడ్ లాంటి నెట్‌వర్క్‌లను ఈ మౌలిక వసతుల భాగాలు కలిగి ఉంటాయి. ఎస్.డబ్ల్యు.ఎ.ఎన్లు, ఎన్.కె.ఎన్, ఎన్.ఓ.ఎఫ్.ఎన్, జి.యు.ఎన్ మరియు జి.ఐ క్లౌడ్ లాంటి అన్ని ఐ.సి.టి మౌలిక వసతుల భాగాలను కలపాలని ఎన్.ఐ.ఐ ఆశిస్తోంది. రాష్ట్ర్రం, జిల్లా, బ్లాక్, పంచాయతీ స్థాయిల్లో వరుసగా 100, 50, 20, 5 ప్రభుత్వ కార్యాలయాలు/సేవా కేంద్రాలకు సమతల కనెక్టివిటీ కోసం సౌలభ్యం ఉంటుంది. ఎలక్ట్రానిక్, ఐ.టి మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు నోడల్ శాఖగా ఉంటుంది. 2. మొబైల్ కనెక్టివిటీకి యూనివర్శల్ యాక్సెస్ దేశంలోని నెట్వర్క్ వ్యాప్తి, కనెక్టివిటీలో వెలుతులను నింపడంపై ఈ ప్రయత్నం దృష్టి సారిస్తుంది. దేశంలో సుమారు 55,619 గ్రామాలకు మొబైల్ కవరేజీ లేదు. ఈశాన్య భారతంలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకు మొబైల్ కవరేజీలేని గ్రామాలకు మొబైల్ కవరేజీని అందించడం ప్రారంభమవుతుంది. దశల వారీ గ్రామాలకు మొబైల్ కవరేజీ అందించబడుతుంది. టెలీకమ్యూనికేషన్ల శాఖ నోడల్ శాఖగా వ్యవహరిస్తుంది. 2014-18 మధ్యలో ఈ ప్రాజెక్టుకోసం సుమారు రూ. 16వేల కోట్లను వెచ్చిస్తారు. 3. పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ కార్యక్రమం యొక్క రెండు ఉప భాగాలు ఉమ్మడి సేవా కేంద్రాలు(CSCs) మరియు పోస్ట్ ఆఫీస్ మల్టి-సర్వీస్ కేంద్రాలు. ఉమ్మడి సేవా కేంద్రాలు(CSCs): ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సియస్సి బలోపేతం మరియు వాటి సంఖ్య 250,000 వరకు పెంచవచ్చు. సియస్సిలు ప్రభుత్వ మరియు వ్యాపార సేవలు అందించడంలో అనుకూలమైన మరియు బహుళ ఉపయోగాలు కలిగిన అంత్య బిందువులగా (ఎండ్ పాయింట్స్) తయారవుతాయి. ఐటి&సి డిపార్టుమెంట్ ఈ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ శాఖ. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. బహుళ సేవా కేంద్రాలుగా తపాలా కార్యాలయాలు: మొత్తం 150,000 తపాలా కార్యాలయాలను బహుళ సేవా కేంద్రాలుగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు తపాలా శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. 4. ఇ-గవర్నెన్స్- సాంకేతికత ద్వారా ప్రభుత్వాన్ని సంస్కరించడం ప్రభుత్వ ప్రక్రియను సులభతరం చేసి మరింత సమర్థవంతంగా చేసేందుకు ఐటీని ఉపయోగిస్తున్న గవర్నమెంట్ ప్రాసెస్ రీఇంజినీరింగ్ వివిధ ప్రభుత్వ రంగాల్లో ప్రభుత్వ సేవల బట్వాడాను మరింత సమర్థవంతంగా చేసేందుకు కావాల్సిన రూపాంతరంలో కీలకంగా నిలుస్తోంది. కాబట్టి మంత్రిత్వ శాఖలు, విభాగాల ద్వారా అమలు చేయాల్సిన అవసరం ఉంది. సాంకేతికత ద్వారా ప్రభుత్వాన్ని సంస్కరించడం కోసం మార్గదర్శక సూత్రాలు: పత్రాలు సులభతరం మరియు క్షేత్ర స్థాయి తగ్గింపు - పత్రాలను తేలిగ్గా, వినియోగదారునికి బాగా అర్థమయ్యేలా, తక్కువగా ఉండేలా చేసి, అవసరమైన సమాచారాన్ని సేకరించాలి. ఆన్లైన్ దరఖాస్తులు మరియు జాడ తెలుసుకోవడం - ఆన్లైన్ దరఖాస్తులు మరియు వాటి స్థితిని తెలుసుకోవడం సౌకర్యం కల్పించాలి. ఆన్లైన్ నిక్షేపాలు-ఉదా. ధృవపత్రాలు, విద్యార్హత పట్టాలు, గుర్తింపు దస్తావేజులు తదితరాల కోసం. ఆన్లైన్ నిక్షేపాలను వినియోగించడం తప్పనిసరి చేయాలి. తద్వారా ఈ దస్తావేజులను పౌరులు భౌతిక రూపంలో అందించాల్సిన అవసరం ఉండదు. సేవలు మరియు ప్లాట్ఫారంల సమ్మేళనం - పౌరులకు, వ్యాపార సంస్థలకు సమగ్ర, పరస్పరం పని చేయగల సేవా బట్వాడాకు వీలు కల్పించడం కోసం యునీక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (యు.ఐ.డి.ఏ.ఐ) యొక్క ఆధార్ వేదికలు, చెల్లింపు గేట్‌వే, మొబైల్ సేవా వేదిక, ఓపెన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసస్ (ఏ.పి.ఏ), జాతీయ మరియు రాష్ట్ర సర్వీస్ డెలివరీ గేట్వేలు (ఎన్.ఎస్.డి.జి/ఎస్.ఎస్.డి.జి)లు లాంటి మిడిల్వేర్లు లాంటి సేవలు మరియు ప్లాట్ఫారంల సమ్మేళనాన్ని తప్పనిసరి చేయాలి. డేటాబేస్, సమాచారం ఎలక్ర్టానిక్ రూపంలో ఉండాలి కానీ మాన్యువల్‌గా కాదు. సమర్థవంతమైన ప్రభుత్వ ప్రక్రియలకు వీలు కల్పించడంతో పాటు పౌరులకు ఈ ప్రక్రియలను కనిపించేలా అనుమతించడానికి ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలలోపల పనితీరును యంత్రమయం(ఆటోమేట్) చేయాలి. అలాగే నిలిచిపోయిన సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి వీలుగా డేటాను యంత్రమయం(ఆటోమేట్) చేసి, స్పందించి, విశ్లేషించడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఇది చాలావరకు మెరుగుదలను ప్రాసెస్ చేస్తుంది. 5. ఇ-క్రాంతి- ఎలక్ట్రానిక్ మార్గంలో సేవల బట్వాడా ఇ-క్రాంతి అనేది డిజిటల్ ఇండియాకు ముఖ్యమైన పునాది. దేశంలో ఇ-గవర్నెన్స్, మొబైల్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ కీలక అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం “పరిపాలన రూపురేఖలు మార్చడం కోసం ఇ-గవర్నెన్స్‌ను రూపాంతరం చేయడం” అనే దార్శనికతతో 25.03.2015న ఇ-క్రాంతి విధానం, కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది. అన్ని కొత్త మరియు ప్రస్తుతం కొనసాగుతున్న ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టులు, ప్రస్తుతం ప్రక్షాళన జరుగుతున్న ప్రాజెక్టులతోపాటు ఇక ‘అనువాదం కాదు రూపాంతరం’, ‘వ్యక్తిగత సేవలు కావు సమగ్ర సేవలు’, ప్రతి ఎం.ఎం.పిలోనూ గవర్నమెంట్ ప్రాసెస్ రీఇంజినీరింగ్ తప్పనిసరి చేయడం’, ‘ఐసీటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ డిమాండ్’, ‘క్లౌడ్ బై డిఫాల్ట్’, ‘మొబైల్ ఫస్ట్’, ‘ఫాస్ట్ ట్రాకింగ్ అప్రూవల్స్’, ‘ప్రమాణాలు, యోగ్యతలను తప్పనిసరి చేయడం’, ’భాష స్థానీకరణ’, ‘నేషనల్ జి.ఐ.ఎస్ (జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)’, ‘సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్ డేటా సంరక్షణ’ ఇ-క్రాంతి కీలక సూత్రాలను అనుసరించాలి. ఇ-క్రాంతి కింద 44 మిషన్ మోడ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలు జరుగుతున్నాయి. నం. ప్రాజెక్ట్ బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ / విభాగం Table 1: సెంట్రల్ మిషన్ మోడ్ ప్రాజెక్టులు (# కొత్త MMP) 01 ఆదాయ పన్ను M/o Finance/Central Board of Direct Tax 02 పాస్‌పోర్టు M/o External Affairs 03 MCA21 M/o Company Affairs 04 బీమా D/o Financial Services 05 నేషనల్ సిటిజన్ డేటాబేస్ M/o Home Affairs/Registrar General of India (RGI) 06 సెంట్రల్ ఎక్సైజ్ D/o Revenue/Central Board of Excise & Custom 07 పెన్షన్లు D/o Pensions & Pensioners welfare & Dept. of Expenditure 08 బ్యాంకింగ్ D/o Financial Services 09 ఇ-ఆఫీస్ D/o Administrative Reforms & Public Grievances 10 తపాలా D/o Posts 11 వీసా & ఇమ్మిగ్రేషన్ M/o Home Affairs 12 ఇ-సన్సద్# Ministry of Parliamentary Affairs 13 పారా మిలిటరీ బలగాలకు ఉమ్మడి ఐ.టి రోడ్ మ్యాప్# M/o Home affairs నం. ప్రాజెక్ట్ బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ / విభాగం Table 2: రాష్ట్రాల మిషన్ మోడ్ ప్రాజెక్టులు (# కొత్త MMP) 01 భూమి రికార్డులు M/o Rural Development 02 రోడ్డు రవాణా M/o Road Transport & Highway 03 ఆస్తి రిజిస్ట్రేషన్ D/o Land Resources and D/o Electronics and Information Technology 04 వ్యవసాయం D/o Agriculture & Cooperation 05 ఖజానాలు M/o Finance 06 మంయికిపాలిటీస్ M/o Urban Development and Poverty Alleviation 07 గ్రామ పంచాయతీలు M/o Panchayati Raj 08 వాణిజ్య పన్నులు M/o Finance 09 పోలీస్ (ప్రారంభంలో కేంద్ర పాలిత ప్రాంతాలు) M/o Home affairs 10 ఉపాధి కల్పన M/o Labour & Employment 11 పాఠశాల విద్య D/o School Education and Literacy 12 ఆరోగ్యం D/o Health and Family Welfare 13 పిడిఎస్ D/o Food and Public Distribution 14 ఇ-విధాన్# Ministry of Parliamentary Affairs 15 వ్యవసాయం 2.0# D/o Agriculture 16 గ్రామీణాభివృద్ధి# D/o Rural Development 17 స్ర్తీ, శిశు అభివృద్ధి# M/o Women and Child Development నం. ప్రాజెక్ట్ బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ / విభాగం Table 3: ఇంటిగ్రేటెడ్ మిషన్ మోడ్ ప్రాజెక్టులు (# కొత్త MMP) 01 EDI (E-Commerce)ఇ-కామర్స్ M/o Commerce & Industry 02 ఇ-బిజ్ D/o Industrial Policy & Promotion 03 ఉమ్మడి సేవాకేంద్రాలు (Common Services Centres) D/o Electronics and Information Technology 04 ఇండియా పోర్టల్ D/o Electronics and Information Technology and D/o Administrative Reforms & Public Grievances 05 ఇ-కోర్టులు D/o Justice 06 ఇ-కొనుగోలు M/o Commerce & Industry/ DGS&D 07 నేషనల్ సర్వీస్ డెలివరి గేట్ వే D/o Electronics and Information Technology 08 ఆర్థిక సమ్మిళితం# D/o Financial Services 09 నేషనల్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్# D/o Science & Technology 10 సామాజిక ప్రయోజనాలు# M/o Social Justice and Empowerment as the leader and other welfare departments as co-owners 11 రహదారులు మరియు ప్రధాన రహదరులు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (RAHI) # M/o Road Transport & Highways 12 ఇ-భాషా # D/o Electronics and Information Technology 13 నేషనల్ మిషన్-ఐసిటి ద్వారా ఎడ్యుకేషన్ (NMEICT) # D/o Higher Education 14 పట్టణ పరిపాలన # పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విద్యారంగం కోసం సాంకేతికత- ఇ-విద్య: అన్ని పాఠశాలలను బ్రాడ్‌బ్యాండ్‌తో కలపనున్నారు. ఉచిత వైఫైను అన్ని మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో అందిస్తారు. (సుమారు 250,000 పాఠశాలలు దీని పరిధిలో ఉంటాయి). డిజిటల్ అక్షరాస్యతపై ఓ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహించనున్నారు. భారీ ఆన్లైన్ ఓపెన్ కోర్సులను (ఎం.ఓ.ఓ.సిలు) ఇ-విద్య కోసం అభివృద్ధి చేసి, వినియోగించనున్నారు. ఆరోగ్యం కోసం సాంకేతికత-ఇ-ఆరోగ్య సంరక్షణ: ఇ-ఆరోగ్య సంరక్షణ అనేది ఆన్లైన్లో వైద్య సంప్రదింపులు, ఆన్లైన్లో వైద్య రికార్డులు, ఆన్లైన్లో మందుల సరఫరా, రోగి సమాచారం కోసం దేశవ్యాప్త మార్పిడీ తదితరాలను పరిధిలో ఉంచుతుంది. 2015లో ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టనున్నారు. మూడేళ్ళలో పూర్తి స్థాయి కవరేజీని అందించనున్నారు. రైతుల కోసం సాంకేతికత: రైతులు తాజా ధరల సమచారాన్ని పొందేందుకు, ఆన్లైన్ ద్వారా ఇన్పుట్లను ఆర్డర్ చేసేందుకు, మొబైల్ బ్యాంకింగ్‌తో ఆన్లైన్ నగదు, రుణం, పరిహారం చెల్లింపును పొందడానికి ఇది వీలు కల్పిస్తుంది. భద్రత కోసం సాంకేతికత: మొబైల్ ఆధారిత అత్యవసర సేవలు, విపత్తు సంబంధిత సేవలను పౌరులకు ఎప్పటికప్పుడనే ప్రాతిపదికన అందిస్తుంది. తద్వారా సకాలంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి, ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించుకోవచ్చు. న్యాయం కోసం సాంకేతికత: పరస్పరం పని చేయగల క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ను పలు సంబంధిత అప్లికేషన్లను వినియోగించడం ద్వారా పటిష్ఠం చేయగలరు. ఉదా. ఇ-కోర్టులు, ఇ-పోలీసు, ఇ-జైళ్లు, ఇ-ప్రాసిక్యూషన్. ఆర్థిక సమ్మిళితం కోసం సాంకేతికత: మొబైల్ బ్యాంకింగ్, మైక్రో-ఏటీఎం కార్యక్రమం, సి.ఎస్.సిలు/తపాలా కార్యాలయాలను ఉపయోగించి ఆర్థిక సమ్మిళితాన్ని పటిష్ఠం చేయగలరు. సైబర్ సెక్యూరిటీ కోసం సాంకేతికత: దేశంలోపల సురక్షితమైన, సైబర్ స్పేస్ ఉండేలా చూసేందుకు నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేయబడుతుంది. 6. అందరి కోసం సమాచారం ఓపెన్ డేటా ప్లాట్ఫారం (http://data.gov.in): ఓపెన్ డేటా ప్లాట్ఫారం అనేది ఉపయోగం, పునరుపయోగం, పునఃపంపిణీ కోసం మంత్రిత్వ శాఖలు, విభాగాల ద్వారా ఓపెన్ ఫార్మాట్లో డేటాసెట్లను చురుగ్గా విడుదల చేసేందుకు వీలు కల్పిస్తుంది. సమాచార ఆన్లైన్ హోస్టింగ్, దస్తావేజులు పౌరులకు సమాచారాన్ని బహిరంగంగా, సులభంగా అందుకునే వీలు కల్పిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం చాలా చురుగ్గా పాలుపంచుకుంటుంది: పౌరులతో సమాచారాన్ని పంచుకోవడానికి, సంభాషించడానికి ప్రభుత్వం సోషల్ మీడియా, వెబ్ ఆధారిత వేదికల ద్వారా చాలా చురుగ్గా పాలుపంచుకుంటుంది. MyGov.in, ప్రభుత్వంతో ఆలోచనలను/సూచనలను పంచుకునే మాధ్యమంగా పరిపాలనలో పౌరులు భాగస్వాములయ్యేలా పాలుపంచుకోవడం కోసం ఈ వేదికను గౌరవనీయులైన ప్రధానమంత్రి 2014 జూలై 26న ప్రారంభించారు. ఇది సుపరిపాలనను తీసుకువచ్చేందుకు పౌరులు, ప్రభుత్వం మధ్య ద్విమార్గ కమ్యూనికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఆన్లైన్ సందేశం: ఇమెయిళ్లు, ఎస్.ఎమ్.ఎస్‌ల ద్వారా ప్రత్యేక వేడుకలు/కార్యక్రమాలలో పౌరులకు ఆన్లైన్ సందేశం ఇవ్వడం. ఓపెన్ డెటా ప్లాట్ఫారం, సోషల్ మీడియా ఒడంబడిక మరియు ఆన్లైన్ సందేశం: ఓపెన్ డేటా ప్లాట్ఫారం, సోషల్ మీడియా ఒడంబడిక మరియు ఆన్లైన్ సందేశం చాలావరకు ప్రస్తుతమున్న మౌలిక వసతులను ఉపయోగించుకుంది. దానికి పరిమిత అదనపు వనరులు కావాల్సి ఉంది. 7. ఎలక్ట్రానిక్స్ తయారీ నెట్ జీరో లక్ష్యం దిగుమతులు అనేది ఉద్దేశ్యాన్ని సూటిగా ప్రదర్శించేవిగా ఉంటాయి. ఈ పునాది ఉద్దేశ్యాన్ని సూటిగా ప్రదర్శించేవిగా 2020 నాటికి దిగుమతులు పూర్తిగా లేని విధంగా దేశంలో ఎలక్ట్రానిక్ తయారీని ప్రోత్సహిస్తుంది. ఆశయం సాధించడానికి కింది విధంగా పలు రకాల్లో సమన్వయంతో కూడిన చర్యను చేపట్టాల్సి ఉంటుంది: పన్ను విధింపులు, ప్రోత్సాహకాలు ఆర్థిక కొలమానం, ఖర్చు ప్రతికూలతలను తొలగించడం దృష్టి కేంద్రీకరించిన రంగాలు- బిగ్ టికెట్ అంశాలు: ఎఫ్.ఏ.బి, ఫ్యాబ్ రహిత డిజైన్, సెట్‌టాప్ బాక్స్‌లు, విశాట్లు, మొబైళ్లు, వినియోగ, మెడికల్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఎనర్జీ మీటర్లు, స్మార్ట్ కార్డులు, మైక్రో ఎ.టి.ఎంలు ఇంక్యుబేటర్లు, క్లస్టర్లు నైపుణ్యాభివృద్ధి, పీహెచ్‌డీల పొడిగింపు ప్రభుత్వ సంపాదన భద్రతా ప్రమాణాలు - తప్పనిసరిగా నమోదు, ల్యాబ్స్ కోసం మద్దతు మరియు ఎంఎస్ఎంఇఎస్ జాతీయ అవార్డు, మార్కెటింగ్, బ్రాండ్ బిల్డింగ్ జాతీయ కేంద్రాలు-సడలించిన ఎలక్ట్రానిక్స్, భద్రతా దళాలు ఎలక్ట్రానిక్స్‌లో పరిశోధన, అభివృద్ధి. ఇప్పుడు కొనసాగుతున్న పలు కార్యక్రమాలను బాగా సరిచేయాల్సి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాలు ఈ లక్ష్యాన్ని నిర్వహించి, పటిష్ఠం చేయడానికి సరిపోదు. 22శాతం వార్షిక స్థూల వృద్ధి రేటుతో ఎలక్ట్రానిక్ వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. 2020 నాటికి అది 400 బిలియన్ డాలర్లను తాకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో ఉత్పత్తిని, పెట్టుబడులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటుంది. పెట్టుబడి పెట్టడానికి అనువైన ప్రదేశాల్లో భారత్‌ను ఇది ఉన్నతంగా నిలుపుతుంది. ఎలక్ట్రానిక్స్‌పై జాతీయ విధానం (ఎన్.పి.ఇ) భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మరియు తయారీ రంగం (ఇ.ఎస్.డి.ఎం)లో పెట్టుబడులు పెట్టేలా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా భారత ప్రభుత్వం అత్యున్నతమైన, పెట్టుబడులకు అనుకూలమైన, మార్కెట్లో దూసుకుని వెళ్ళగలిగేదిగా ఎలక్ట్రానిక్స్‌పై జాతీయ విధానాన్ని (ఎన్.పి.ఇ)ను 2012లో ఆవిష్కరించింది. ఇది ఇ.ఎస్.డి.ఎం రంగంలో భారతదేశాన్ని ఓ ప్రధాన కేంద్రంగా భావించి, ప్రపంచంలోని తదుపరి తరం ఎలక్ట్రానిక్ ఉత్పాదక కేంద్రంలో భాగం పోషించేలా కంపెనీలకు ఓ విశిష్ఠమైన అవకాశాన్ని అందిస్తుంది. అంతేకాక మధ్య, అత్యున్నత స్థాయి సాంకేతికతలను కలిగిన విలువ ఆధారిత ఉత్పత్తిని కూడా అందిస్తుంది. (ఎన్.పి.ఇ) 2012 ముసాయిదా కోసం బలమైన పునాది ఏర్పరచడంలో భారత ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. ఇది మధ్య స్థాయి, ఉన్నత స్థాయి సాంకేతికతలను కలిగిన విలువ ఆధారిత తయారీలో సహాయపడుతుంది. ఈ పాలసీలోని ప్రధానాంశాలను కింది వాటితో పాటు భారత ప్రభుత్వం తీసుకుంటుంది: మూలధన వ్యయంలో 25శాతం (సెజ్‌లలో అయితే 20శాతం) మోడిఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ స్కీమ్ (ఎం.ఎస్.ఐ.పిలు) సబ్సిడీ అందుబాటులో ఉంది. మూలధన పరికరాలకు చెల్లించిన ఎక్సైజ్/సీవీడిని రీఇంబర్స్ చేసుకోవచ్చు. గ్రీన్‌ఫీల్డ్ క్లస్టర్లలో (ఎలక్ట్రానిక్ ఉత్పత్తి దృష్టిలో చూస్తే అభివృద్ధి చెందని లేదా తక్కువగా అభివృద్ధి చెందిన ప్రాతం) మౌలిక వసతుల అభివృద్ధి, సాధారణ మౌలిక వసతుల అభివృద్ధి కోసం అయ్యే ఖర్చులో 50%, బ్రౌన్ ఫీల్డ్ క్లస్టర్లకు (ప్రస్తుతం ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతం) అయ్యే ఖర్చులో 75% ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్స్ పథకం అందిస్తుంది. భారత ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న పలు కొత్త ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లలో స్థలం రెడీగా అందుబాటులో ఉండవచ్చు. ప్రస్తుతం సుమారు 30 ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు నోటిఫై చేయబడ్డాయి. 2020 నాటికి 200 ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ కొనుగోలులో స్థానికంగా తయారు చేసిన సరకులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రభుత్వ కొనుగోలు పరిధి 30% కన్నా తక్కువగా ఉండరాదు. సుమారు 30 ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఇప్పటికే ఈ పథకం కింద తెలియజేయబడ్డాయి. స్వదేశంలో తయారు చేసిన సెట్ టాప్ బాక్సులు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతి విదేశీ వాణిజ్య విధానం కింద ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్‌లో 25శాతం ప్రోత్సాహకానికి అర్హత పొందుతుంది. ఎలక్ట్రానిక్స్‌లో స్టార్టప్‌లను, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఐ.పి. తరానికి తోడ్పాటు అందించడానికి ఎలక్ట్రానిక్ రంగంలో పరిశోధన, అభివృద్ధి, నవ్యావిష్కరణల కోసం ఎలక్ట్రానిక్ అభివృద్ధి నిధుల అందించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. దేశంలో రెండు సెమీకండక్టర్ వేఫర్ ఫేబ్రికేషన్ (ఎఫ్.ఏ.బి) ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు శాఖ ఆమోదం పొందింది. ఎలక్ట్రానిక్స్, ఐ.టి రంగంలో గొప్ప పరిశోధనను ప్రోత్సాహించడానికి, భారత ప్రభుత్వం పరిశ్రమ నిర్ధిష్ఠ అవసరాలలో పరిశోధన కోసం దేశం నలుమూలల్లోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఐ.టీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో ఈ కార్యక్రమం ద్వారా 3000 పీహెచ్‌డీలను తయారు చేయనున్నారు. టెలికాం, ఎలక్ట్రానిక్స్ అనే రెండు సెక్టార్ నైపుణ్య మండళ్ల ద్వారా ప్రైవేటు రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం అవకాశాలను అందించడం. నైపుణ్యాభివృద్ధి కోసం తోడ్పాటును అందించే పథకం కింద, భారత ప్రభుత్వం నైపుణ్యం కలిగిన, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు పరిశ్రమలకు అనువైన నైపుణ్యాలను అందించడం కోసం అయ్యే ఖర్చుల్లో 75% నుండి 100%భారత ప్రభుత్వం అందిస్తుంది. తప్పనిసరి ప్రమాణాల పాలన పరీక్ష ప్రయోగశాల మౌలిక వసతుల్లో పెట్టుబడుల కోసం అవకాశాలను అమల్లోకి తీసుకువచ్చారు. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తమ రాష్ట్ర ఎలక్ట్రానిక్ విధానాలలో ప్రోత్సాహకాలను ప్రకటించాయి. మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, పంజాబ్, కేరళ రాష్ట్రాలు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను ప్రకటించాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే రకమైన ప్రయత్నాలను చేపట్టే క్రమంలో ఉన్నాయి. తద్వారా ఇ.ఎస్.డి.ఎం పెట్టుబడిదారులకు అనేక ప్రోత్సాహకాలను, సౌకర్యాలను అందిస్తున్నాయి. దీంతో పాటుగా, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మరియు అండ్ తయారీ (ఇ.ఎస్.డి.ఎం) రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలను గుర్తించి, ప్రోత్సాహించడం కోసం భారత ప్రభుత్వం ఈ రంగానికి ఓ జాతీయ పథకాన్ని ప్రకటించింది. ఉత్పాదకతను ప్రోత్సాహించడానికి, భారత ఉత్పాదకతలోకి నాణ్యతను నిర్మించడానికి, ఎగుమతులను ప్రోత్సాహించడానికి ఆర్థిక తోడ్పాటును అందించే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద తోడ్పాటును ఎం.ఎస్.ఎం.ఇలలో తయారీదారులకు రీఇంబర్స్మెంట్ రూపంలో అందిస్తారు. గ్రాండ్ ఎయిడ్‌గా ఆర్థిక తోడ్పాటును అందించడం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం ఎలక్ట్రానిక్స్ రంగంలో తయారీదారులు, స్వదేశీ పరిశ్రమ, ఎగుమతిదారులకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నారు. మధ్య స్థాయి, ఉన్నత స్థాయి సాంకేతికతలను కలిగిన విలువ ఆధారిత ఉత్పాదకతను ఆకర్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది. కింది కార్యకలాపల కోసం ఈ పథకం జి.ఐ.ఏను అందిస్తుంది: కేంద్ర ఐ.టీ, యువజన వ్యవహారాల శాఖ పేర్కొన్న “భారత ప్రమాణాల”తో ఎలక్ట్రానిక్ వస్తువుల పొంతనకు సంబంధించిన ఖర్చుల రీఇంబర్స్మెంట్. ఒక నమూనాకు మొత్తం జి.ఐ.ఏను లక్షకు పరిమితం చేసి, గరిష్ఠంగా కేవలం 200 నమూనాలకు మాత్రమే ఇచ్చారు. ఎగుమతి కోసం అవసరమైన పరీక్ష మరియు ధృవీకరణ కోసం అయ్యే ఖర్చుల రీఇంబర్స్మెంట్. ఈ పథకం కింద మొత్తం జి.ఐ.ఏ ఒక నమూనాకు 1.25 లక్షలు. (గరిష్ఠంగా) 800 నమూనాలు మాత్రమే. నిర్ధారణ అధ్యయనం, సులభతరమైన జోక్యం, సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తయారు చేయడం తదితరాల కోసం ఎం.ఎస్.ఎం.ఇల ద్వారా ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ల అభివృద్ధి. క్లస్టర్ల అభివృద్ధి కోసం పథకంలోని ఈ విభాగం కింద రూ. పది లక్షలు మొత్త జి.ఐ.ఏగా అందుతుంది. గరిష్ఠంగా 20 క్లస్టర్లను ఏర్పాటు చేయడం కోసం ఇవి అందించబడుతాయి. ఎలక్ట్రానిక్ డిజైన్, ఉత్పాదన విభాగానికి ఈ ప్రోత్సాహకాలన్నీ అందుబాటులో ఉంటాయి. విదేశం నుంచి ఉత్పాదక ప్లాంట్ స్థల మార్పుకోసం కూడా ఇది అందుబాటులో ఉంటుంది. సెమీ కండక్టర్ ఎఫ్.ఏ.బి, టెలికాం ఉత్పత్తులు, ఎల్.ఇ.డి ఫ్యాబ్ మరియు ఉత్పత్తులు, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ ఏటీఎంపీలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, అప్లయన్సస్, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు సహా చేతి సాధనాలు, వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్, ఇ.ఎం.సి, ఏవియానిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ తదితరాలను ఈ రంగంలో కొన్నిటిగా చెప్పవచ్చు. ఉత్పత్తి ఆధారిత పరిశోధన, అభివృద్ధి వ్యయాన్ని కూడా ఎం.ఎస్.ఐ.పి.ఎస్ కింద చేర్చారు. ఈ విధానాల వివరాలను శాఖాపరమైన వెబ్సైట్లో సూచించవచ్చు: www.deity.gov.in/esdm 8. ఉద్యోగాలకు ఐ.టి ఈ పునాది ఐ.టి, ఐటి ఆధారిత సేవల రంగాల్లో ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం అవసరమైన నైపుణ్యాలలో యువతకు శిక్షణను అందించడంపై దృష్టి సారిస్తుంది. ఈ పునాది కింద చేపట్టే నిర్ధిష్ఠ కార్యకలాపాల పరిధితో ఎనిమిది భాగాలున్నాయి: చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఐ.టి. శిక్షణ వచ్చే ఐదేళ్ళలో ఐ.టి రంగం ఉద్యోగాల కోసం చిన్న పట్టణాలు, గ్రామాలకు చెందిన కోటి మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఈ భాగానికి లక్ష్యంగా నిర్ణయించారు. ఈ పథకానికి కేంద్ర ఐటీ, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఐ.టి/ఐ.టి ఆధారిత సేవలు ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఐ.సి.టి ఎనేబుల్ వృద్ధికి వీలు కల్పించడం కోసం ప్రతి ఈశాన్య రాష్ట్రంలోనూ బీపీఓను ఏర్పాటు చేయడంపై ఈ భాగం దృష్టి సారిస్తుంది. ఈ పథకానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం (DeitY) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సేవా పంపిణీ ఏజెంట్లకు శిక్షణ ఐటీ సేవలను బట్వాడా చేస్తూ సాగే సులభమైన వ్యాపారాలను నడిపేందుకు నైపుణ్యాభివృద్ధిలో భాగంగా మూడు లక్షల సేవా బట్వాడా ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. టెలికాం మరియు టెలికాం సంబంధిత సేవలపై గ్రామీణ మానవ వనరులకు శిక్షణ ఈ భాగం తమ సొంత అవసరాలను తీర్చేలా టెలికాం సేవా సంస్థలకు చెందిన ఐదు లక్షల మంది గ్రామీణ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారిస్తుంది. 'టెలీ కమ్యూనికేషన్ల శాఖ దీనికి వోబల్ శాఖగా వ్యవహరిస్తుంది. ఈశాన్య భారత బి.పి.ఓ ప్రోత్సాహక పథకం (NEBPS) భారతీయ బి.పి.ఓ పరిశ్రమ గడచిన కొన్నేళ్ళుగా గణనీయమైన ప్రగతిని సాధించింది. అంతర్జాతీయంగా ప్రాధాన్యం కలిగిన బి.పి.ఓ కేంద్రాలలో ఒకటిగా భారతదేశం క్రమంగా అవతరిస్తోంది. నిర్వహణ ఖర్చు ప్రభావం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అందుబాటు, ఉద్యోగ అవకాశాల కోసం రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ దేశంలో బి.పి.ఓ పరిశ్రమ వృద్ధి చెందడంలో పాత్ర పోషిస్తున్నయి. అయినప్పటికీ, బి.పి.ఓ పరిశ్రమ చాలావరకు పెద్ద (ప్రథమ శ్రేణి) నగరాల చుట్టూ వ్యాపించాయి.. ఈశాన్య భారతం సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉపాధిని కోరుకుంటున్నారు. భారీ (ప్రథమ శ్రేణి) నగరాల్లో, ఉద్యోగులకు నివాస వసతి, ఎక్కువ ప్రయాణ దూరాన్ని దృష్టిలో పెట్టుకుంటే, కంపెనీకి నిరంతరం కొనసాగుతున్న మానవవనరుల వ్యయం ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. కాబట్టి మానవవనరుల ఖర్చులు గణనీయంగా తగ్గగలదని బి.పి.ఓ కంపెనీలు మరింత చిన్న (ద్వితీయ/తృతీయ శ్రేణి) నగరాలకు వలసలు వెళ్లడం సాగుతుంది. తద్వారా వాటి కార్యకలాపాలు మరింత లాభదాయకం కాగలవు. ఈశాన్య భారతంలో బి.పి.ఓ కార్యకలాపాలను నిర్వహించడం కోసం కీలకమైనవిగా నమ్మకమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, కరెంటు సరఫరాకు సంబంధించిన వివిధ అంశాలను చెప్పవచ్చు. ఈశాన్య భారతంలో బి.పి.ఓలను ప్రోత్సాహించడం: ప్రస్తుత సన్నివేశం: అవసరమైన నిధులు, పరిపాలనపరమైన విధానాలను ఓ కొత్త కేంద్రం ప్రారంభానికి ప్రధాన అడ్డంకులుగా చెప్పవచ్చు మారిన సన్నివేశం ఈశాన్య భారత బి.పి.ఓ ప్రోత్సాహక పథకం (ఎన్.ఇ.బి.పి.ఎస్) కింద సాయం కోసం పౌరులు దరఖాస్తు చేసుకుని, మూలధనంలో 50% పొందవచ్చు. ముందు చెప్పిన నేపథ్యంలో, సముచిత ప్రోత్సాహకాల ద్వారా ఈశాన్య భారత ప్రాంతంలో బి.పి.ఓల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టిని ఇవ్వాలని నిర్ణయించబడింది. ప్రస్తుతం ఓ ముసాయిదా పథకం పేరుతో, “ఈశాన్య భారత బి.పి.ఓ ప్రోత్సాహక పథకం (NEBPS)” ఈశాన్య భారత ప్రాంతంలో బి.పి.ఓ/కాల్ సెంటర్ల ఏర్పాటును సున్నితం లేకుండా చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవడం కోసం. సుమారు 12000 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించాలని భావిస్తున్నందున ప్రస్తుత ఐదేళ్ళ ప్రణాళిక చివరి వరకు 4000 కూర్చొనే సామర్థ్యాన్ని రూపొందించడానికి ఇది ఊహిస్తుంది. 9. త్వరిత దిగుబడి కార్యక్రమాలు త్వరితగతి దిగుబడి కార్యక్రమం అనేది ప్రాథమికంగా తక్కువ కాలపరిమితిలోపల అమలు చేయగల ప్రాజెక్టులను కలిగి ఉంటుంది. త్వరితగతి దిగుబడి కార్యక్రమం కింద ప్రాజెక్టులు కింది విధంగా ఉన్నాయి: సందేశాలకు ఐ.టి ప్లాట్‌ఫారమ్: ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అందరు ప్రభుత్వోద్యోగులను కలిగి ఉండేలా ఓ సామూహిక సందేశ బట్వాడా అప్లికేషన్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. 1.36 కోట్లకు పైగా మొబైళ్ళు, 22 లక్షలకు పైగా ఇమెయిళ్ళు డేటాబేస్‌లో భాగంగా ఉన్నాయి. ఈ పోర్టల్‌ను 2014 ఆగస్టు 15న విడుదల చేశారు. డేటా సేకరణ, డేటా శుభ్రత ప్రక్రియలు ప్రస్తుతం సాగుతున్నాయి. ఇ-గ్రీటింగులుగా ప్రభుత్వ శుభాకాంక్షలు: ఇ-గ్రీటింగ్ టెంప్లెట్ల బాస్కెట్ అందుబాటులో ఉంచబడింది. మై గవ్ ప్లాట్ఫారం ద్వారా ఇ-గ్రీటింగ్‌ల క్రౌడ్ సోర్సింగ్ ఉండేలా చూడబడుతుంది. స్వతంత్ర దినం, ఉపాధ్యాయుల దినం, గాంధీ జయంతి శుభాకాంక్షలకు డిజైన్లను రూపొందించడానికి కూడా క్రౌడ్ సోర్సింగ్ ఉపయోగించబడుతుంది. ఇ-గ్రీటింగ్స్ పోర్టల్‌ను 14 ఆగస్టు 2014న ప్రత్యక్షంగా వీక్షింపజేశారు. బయోమెట్రిక్ హాజరు: అది ఢిల్లీనుంచి మొదలై కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్నిటినీ కలిగి ఉంటుంది. 150 సంస్థలకు చెందిన 40వేలకు పైగా ఉద్యోగులు ఇప్పటికే ఉమ్మి బయోమెట్రిక్ అటెండన్స్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు http://attendance.gov.in వైఫై యాక్సెస్ పాయింట్లు, మొబైల్ కనెక్టివిటీలతో వివిధ కేంద్ర ప్రభుత్వ భవనాల ప్రవేశ ద్వారాల వద్ద వెయ్యికి పైగా బయోమెట్రిక్ అటెండన్స్ టెర్మినల్స్ ప్రస్తుతం ప్రతిష్ఠాపన దశలో ఉన్నాయి. ఢిల్లీలోని ఏదేని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులు తమ హాజరును నమోదు చేయవచ్చు. అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ వైఫై: నేషనల్ నాలెడ్జి నెట్‌వర్క్‌పై అన్ని విశ్వవిద్యాలయాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఆర్.డి) నోడెల్ ఏజెన్సీగా ఉంటుంది. ప్రభుత్వ పరిధిలో సురక్షిత ఇమెయిల్: ఇమెయిల్ అనేది ప్రభుత్వం పరిధిలో ప్రాథమికమైన కమ్యూనికేషన్ విధానం. ప్రభుత్వ ఇమెయిల్ మౌలిక వసతి తగిన రీతిలో విస్తరించి, స్థాయి పెంచనున్నారు. మొదటి దశలో పది లక్షల మంది ఉద్యోగులకు మౌలిక వసతుల స్థాయి పెంపు అనేది ఇప్పటికే పూర్తయింది. రెండో దశ కింద రూ. 98కోట్ల వ్యయంతో 2015 మార్చి నాటికల్లా 50 లక్షల మంది ఉద్యోగులను దీని పరిధిలోకి తీసుకువచ్చేలా మౌలిక వసతుల స్థాయిని మరింత పెంచనున్నారు. ఈ పథకానికి ఎలక్ట్రానిక్స్, ఐ.టి మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ప్రభుత్వ ఇమెయిల్ డిజైన్ ప్రామాణికీకరణ: ప్రభుత్వ ఇమెయిల్ కోసం ప్రామాణికీకరించిన టెంప్లెట్లు సిద్ధం చేయబడుతాయి. దానిని ఎలక్ట్రానిక్స్, ఐ.టి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. బహిరంగ వైఫై హాట్స్పాట్లు: డిజిటల్ నగరాలను ప్రోత్సహించడం కోసం పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాలు, పర్యాటక కేంద్రాలలో బహిరంగ వైఫై స్పాట్లు అందుబాటులోకి తీసుకురాబడుతాయి. ఈ పథకాన్ని కేంద్ర సాంకేతిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖలు అమలు చేస్తాయి. ఇ-పుస్తకాలుగా పాఠశాల పుస్తకాలు: అన్ని పుస్తకాలు ఇబుక్స్ గా మార్పిడీ చేయబడ్డాయి. ఈ పథకానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నోడెల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఎస్.ఎమ్.ఎస్ ఆధారిత వాతావరణ సమాచారం, విపత్తు హెచ్చరికలు: ఎస్.ఎమ్.ఎస్ ఆధారిత వాతావరణ సమాచారం, విపత్తు హెచ్చరికలు అందించబడ్డాయి. దీనికోసమే ఎలక్ట్రానిక్, ఐ.టి మంత్రిత్వ శాఖ మొబైల్ సేవ ప్లాట్ ఫారం అందుబాటులోకి తీసుకురాబడింది. భూ శాస్త్రం (ఎం.ఓ.ఇ.ఎస్) మంత్రిత్వ శాఖ, (భారత వాతావరణ శాఖ -ఐ.ఎం.డి)/హోం మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఏ) (జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ -ఎన్.డి.ఎం.ఏ)లు ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. తప్పిపొయిన, దొరికిన పిల్లల కోసం జాతీయ పోర్టల్: a. ఇది తప్పిపోయిన మరియు దొరికిన పిల్లల సమాచారాన్ని వెంటనే సేకరించి, పంచుకోవడానకి వీలు కల్పిస్తుంది. నేరాలను అదుపు చేసుకుని, సకాలంలో స్పందించడాన్ని మెరుగుపరచడానికి చాలా సమయం పడుతుంది. కింది విశిష్ఠతలతో ఈ పోర్టల్ కొత్తగా రూపకల్పన చేయబడింది: మొబైల్ అప్లికేషన్ల ద్వారా పౌరుల భాగస్వామ్యాన్ని విస్తరించు పోలీసు శాఖకు మొబైల్/ఎస్.ఎమ్.ఎస్ అలెర్ట్ సిస్టమ్ (శిశు సంక్షేమ శాఖ అధికారి) పౌరుల కోసం మెరుగైన నేవిగేషన్ ప్రణాళిక చిన్నారి సేవలను ఏకం చేసే సదుపాయం సిస్టమ్/ వెబ్ పోర్టల్‌కు ఆదరణ పెంచడానికి సోషల్ మీడియాను ఉపయోగించడం b. ఈ కార్యక్రమానికి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖలు నోడల్ ఏజెన్సీలు పని చేస్తాయి. ఆధారం: డిజిటల్ ఇండియా వెబ్ సైట్