ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ సాంస్కృతిక సమగ్రత - వ్యవస్థల ఏకీకరణ ఏ దేశమైనా సమాజమైనా పురోగమన పథంలో సాగాలంటే ఐక్యతే బలమైన పునాది. దేశ సమగ్రత సురక్షితంగా ఉండాలంటే ఐక్యత అవశ్యం. వికసిత భారత్ లక్ష్య సాధనకు ఐక్యత అత్యంత కీలకం. దేశ పౌరుల మధ్య భాష, సంస్కృతి, సంప్రదాయాల ఆదానప్రదాన సౌలభ్యం ధ్యేయంగా మొదలైన ఈ కార్యక్రమం, గడచిన దశాబ్ద కాలంలో సుపరిపాలనకు ఆత్మగా రూపాంతరం చెందింది. ఆనాడు 550కి పైగా సంస్థానాలను ఏకం చేయడంలో సర్దార్ పటేలు స్ఫూర్తినిచ్చిన ఈ దృక్పథమే నేడు పన్ను విధానం, రేషన్ పంపిణీ, పింఛన్లు, రాజ్యాంగం, పరీక్షలు, పరిశోధనల వంటి అనేకానేక రంగాలలో "ఒకే దేశం-ఒకే వ్యవస్థ" దిశగా వివిధ కార్యక్రమాలకు మూలస్తంభంగా నిలుస్తోంది. ప్రారంభం: 31 అక్టోబరు 2015 నాలుగు మూలస్తంభాలపై భారత్ ఐక్యత సాంస్కృతిక ఐక్యత : వేల ఏళ్లుగా కొనసాగుతున్న భారత ప్రాచీన సాంస్కృతిక సంప్రదాయాలు, పుణ్యక్షేత్రాలు, పండుగలు, యోగా, సాంస్కృతిక ఆదానప్రదానాలే దేశాన్ని ఏకీకృతం చేసే శక్తులు. భాషా ఐక్యత : భారత వైవిధ్యానికి, శక్తికి మూలమైన వందలాది భాషలు, మాండలికాలను గుర్తించి, అన్ని భారతీయ భాషలను గౌరవిస్తూ ప్రోత్సహించడం. వివక్ష రహిత అభివృద్ధి : ప్రాథమిక సౌకర్యాలు, ప్రగతి ఫలాలను ప్రతి పౌరునికీ చేరుస్తూ.. పేదరికం, అసమానత, వివక్షలను రూపుమాపడం ద్వారా సామాజిక ఐక్యతకు ఆటంకాల తొలగింపు. అనుబంధాలను ముడివేస్తున్న అనుసంధానం : రోడ్లు, రైలు, జాతీయ రహదారి, వాయు మార్గాలతో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా భౌగోళిక దూరాన్ని తగ్గించి, ప్రజల మధ్య సంబంధాలు, అనుబంధాలను ప్రోది చేయడం. సంస్కృతి నుంచి జాతీయ సమైక్యత దాకా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముధ్య భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల ఆదానప్రదానాన్ని ప్రోత్సహించడమే సర్దార్ వల్లభభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా 'జాతీయ సమైక్యతా దినోత్సవం' నాడు ప్రారంభించిన ఈ కార్యక్రను ప్రధానోద్దేశం. సాంస్కృతిక పర్యటనలు, భాషా శిబిరాలు, విద్యార్థి-ఉపాధ్యాయ ఆదానప్రదానాలు, ఉత్సవాలు, క్విజ్- వ్యాస రచన పోటీల నిర్వహణ తదితరాల కోసం రెండేసి రాష్ట్రాలను ఒక జోడీగా రూపొందించారు. ఇది కేవలం భౌగోళిక స్వరూపాన్ని చూపే చిత్రపటాలకు పరిమితమైనది కాదు. దేశంలోని ఒక ప్రాంత ప్రజలు మరొక ప్రాంతం గురించి ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకోవాలన్నదే దీని పరమావధి. కాలక్రమంలో ఈ కార్యక్రమం ఒక విస్తృత విధానంగా రూపాంతరం చెంది, వైవిధ్య పరిరక్షణ సహా సమైక్యతను బలోపేతం చేసే లక్ష్యంతో వ్యవస్థల ఏకీకరణకు బాటలు వేసింది. భాషా సమైక్యత పెంపు దిశగా భారతీయ భాషలలో విద్య, భాషాపరమైన ప్రోత్సాహం. సారాష్ట్ర-తమిళ సంగమం, కాశీ-తమిళ సంగమం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా సాంస్కృతిక అనుబంధం. కాశీ - తమిళ సంగమం : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022లో శ్రీకారం చుట్టిన 'కాశీ- తమిళ సంగమం' (కేటీఎస్) ఓ సాంస్కృతిక వారధికి పునారి వేసింది. దీనిలో భాగంగా ఇప్పటిదాకా నిర్వహించిన నాలుగు విడతల కార్యక్రమాలతో ఈ బంధం మరింత బలపడింది. తమిళనాడు- కాశీ నగరాల విద్యా, సాంస్కృతిక అనుసంధాన వేదికగా మారింది. కేటీఎస్ 1.0 ఒక గొప్ప సాంస్కృతిక అనుభూతినివ్వగా, కేటీఎస్ 2.0లో ప్రజల భాగస్వామ్యం సహా నిర్దిష్ట అంశాలపై విస్తృత చర్చలు సాగాయి. కీటీఎస్ 3.0 జ్ఞాన సముపార్జనపై దృష్టి సారించగా, కేటీఎస్ 4.0 తమిళ భాష అభ్యసనానికి ప్రాధాన్యమిచ్చింది. సౌరాష్ట్ర- తమిళ సంగమం: గుజరాత్ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సంస్కృతి, వారసత్వాలకు గుర్తింపుగా 2023లో సౌరాష్ట్ర తమిళ సంగమం కార్యక్రమాన్ని నిర్వహించారు. పది రోజులపాటు సాగిన ఈ ఉత్సవంలో సౌరాష్ట్రలోని 3,000 మందికి పైగా తమిళులు పాల్గొన్నారు. యువ సంగమం: ప్రస్తుతం 7వ విడత కార్యక్రమం కొనసాగుతుండగా, యువతరం విద్యాపరమైన పర్యటనల అవకాశం కల్పిస్తోంది. భాషా సంగమం: ఇది ఒక యాప్. వివిధ భారతీయ భాషలపై అవగాహన కల్పించడంతోపాటు వాటిని నేర్చుకునే అవకాశం కల్పించడం దీని ప్రధానోద్దేశం. ఒకే దేశం- ఒకే సమయం విదేశీ ఉపగ్రహ ఆధారిత సమయ వనరుల పరాధీనత తగ్గింపు కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ ఆగస్టు 27న 'లీగల్ మెట్రాలజీ భారత కాలమానం నిబంధనలు-2026 (ఇండియన్ స్టాండర్డ్ టైమ్ రూల్స్)ను జారీ చేసింది. ఈ ప్రకటనను గజిట్ ప్రచురించిన నేపథ్యంలో 180 రోజుల తర్వాత అవి అమలులోకి వస్తాయి. చట్టం, పరిపాలన, వాణిజ్య, అధికారిక అవసరాల దిశగా దేశమంతటా భారత కాలమానం (ఐఎసీటీ) ఏకరూప సమయ సూచికగా పని చేస్తుంది. భారత సమయ సూచన మౌలిక సదుపాయాల కోసం విదేశీ ఉపగ్రహ ఆధారిత వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో 'ఒకే దేశం- ఒకే సమయం' కార్యక్రమం దోహదపడుతుంది. ఉమ్మడి సమయ సూచన ద్వారా బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులకు కచ్చితమైన 'టైమ్-స్టాంపింగ్' సాధ్యమవుతుంది. రైల్వేలు, విమానాశ్రయాలు, టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్, విద్యుత్ వ్యవస్థల మధ్య మెరుగైన సమన్వయం ఏర్పడుతుంది. ప్రభుత్వ, చట్టపరమైన రికార్డులు సహా అత్యవసర, ఇతర సమయానుగుణ సేవల సంబంధిత సమన్వయం కూడా మెరుగుపడుతుంది. 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' మూలస్తంభాలివే ఆహారోత్సవాలు - పాక సంప్రదాయాలు: జోడుకట్టిన రాష్ట్రాల మధ్య పాక సంస్కృతుల ఆదానప్రదాన సౌలభ్యం దిశగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో పాలుపంచుకునే వారు భాగస్వామ్య రాష్ట్రాల రుచులను ఆస్వాదించడమేగాక, అక్కడి ప్రత్యేక వంటకాల గురించి తెలుసుకోగలుగుతారు. సాంస్కృతిక ఆదానప్రదానం: ఈ అంశంలో భాగంగా భారతీయ సంస్కృతి, పండుగల ఆనందానుభూతిని పొందే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాలలో వీటిని ఎలా నిర్వహించుకుంటారు.. వాటి ప్రాధాన్యం ఏమిటి? తదితరాలను ప్రజలు అర్ధం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సంప్రదాయ స్థానిక వంటకాలు, పాకశాస్త్ర పద్ధతులను కూడా ప్రదర్శిస్తారు. యువజనోత్సవాలు : వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపిక చేసిన సంస్థలు, సొంత-భాగస్వామ్య రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలను ఆహ్వానించి ఈ యువజనోత్సవాలను నిర్వహిస్తాయి. 'ఏక్ భారత్ శ్రేష్ట భారత్' క్లబ్బులు : దేశంలోని విద్యాసంస్థలన్నిటిలో ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రత్యేక క్లబ్బులు ఏర్పాటయ్యాయి. ప్రచార సందేశ వ్యాప్తితోపాటు ప్రతి నెలలో 'ఏక్ భారత్ -శ్రేష్ఠ భారత్' దినోత్సవాన్ని ఇవి నిర్వహిస్తాయి. విద్యారంగ ఆదానప్రదానం : విద్యా సంబంధిత అంశాలపై దేశంలోని విద్యా సంస్థలు పాలుపంచుకుంటాయి. కార్యకలాపాలలో భాగంగా సిమివార్లు-వెబినార్ల నిర్వహణ, భాగస్వామ్య రాష్ట్రాల్లోని సంస్థల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రీడా కార్యక్రమాలు: ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడలపై దృష్టి సారిస్తూ యువతలో జట్టు స్ఫూర్తిని పెంచే దిశగా క్రీడా కార్యకలాపాలను నిర్వహిస్తారు. ముఖ్యంగా సంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యమిస్తారు. పర్యాటక ఆదానప్రదానం: భాగస్వామ్య రాష్ట్రాల్లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణీయ ప్రాంతాలపై విజ్ఞానం, అవగాహన పొందడమే దీని లక్ష్యం, స్మారక చిహ్నాలు. పర్యాటక ప్రదేశాల సమాచార విస్తరణ, పర్యటన నిర్వాహకుల కోసం రోడ్ షోల నిర్వహణ, 'హోమ్ స్టీ'ల ఏర్పాటుకు ప్రోత్సాహం వంటివి ఈ కార్యకలాపాల్లో భాగంగా ఉంటాయి. పుస్తకాల అనువాదం: భాగస్వామ్య రాష్ట్రాల సాహిత్యం, ఇతరత్రా సమాచారంపై అవగాహన సౌలభ్యం దిశగా ఆయా రాష్ట్రాల పుస్తకాలు, పర్యాటక కరదీపికల అనువాదం. భాగస్వామ్య రాష్ట్రం భాషను నేర్చుకోవడం: భాగస్వామ్య రాష్ట్రాల భాషలతో ప్రజలకు పరస్పర పరిచయం ద్వారా స్థానిక జనాభాతో ప్రాథమిక సంభాషణకు వీలు కల్పించడం 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' లక్ష్యం. ఆ మేరకు ఇతర భారతీయ భాషలను నేర్చుకునేలా అందర్నీ ప్రోత్సహిస్తారు. సారూప్య అర్ధాలు గల సామెతలను నేర్పుతారు. పాటలను అనువదిస్తారు. నిత్యం ఒక వాక్యాన్ని 22 భాషల్లోకి అనువదించడం ద్వారా భాషలపై అవగాహన పెంచుతారు. పర్యటనలు- శిబిరాలు: భాగస్వామ్య రాష్ట్రాల్లో పర్యటనలు, శిబిరాలను నిర్వహిస్తారు. పండుగలు- వేడుకలు: ఆయా రాష్ట్రాల పండుగలతోపాటు ఇతరత్రా వేడుకలను నిర్వహిస్తూ, వాటిలో పాల్గొనాల్సిందిగా భాగస్వామ్య రాష్ట్రాలను ఆహ్వానిస్తారు. ప్రతి రాష్ట్రానికీ విస్తరించిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఐక్యత దిశగా వినూత్న కార్యక్రమం వేదికల చారిత్రక మార్పు: దేశ రాజధాని ఢిల్లీకి మాత్రమే పరిమితమైన జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకను దేశవ్యాప్త ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో నిర్వహించే వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పుడు శ్రీకారం చుట్టింది. గుజరాత్‌లోని కేవడియాతో శ్రీకారం: ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఏడాది సెప్టెంబరు 22న గుజరాత్‌లోని కేవడియాలో 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' వద్ద ప్రారంభించారు. 'ఏక్ భారత్ - శ్రేష్ట భారత్' సందేశం: ఆధునిక భారత నిర్మాత సర్దార్ వల్లభ బాయ్ పటేల్ విగ్రహం సమీపంలోని వేదికపై చలనచిత్ర రంగ ప్రతిభను, వైవిధ్యాన్ని గౌరవించడం 'ఏక్ భారత్ -శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి నిదర్శనం. కార్యక్రమ నిర్వహణపై రాష్ట్రాలకు ఆహ్వానం: ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపాలని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్ని రాష్ట్రాలకూ విజ్ఞప్తి చేశారు. తదనుగుణంగా ఎంపిక చేసిన రాష్ట్రంలో తదుపరి పురస్కార ప్రదానోత్సవం నిర్వహిస్తారు. పర్యాటకం జాతీయ ఐక్యతకు ప్రోత్సాహం: కళ, సంస్కృతి, పర్యాటకంతో కూడిన ఈ సంగమం ప్రాంతీయాభివృద్ధిని, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, దేశాన్ని ఐక్యంగా నిలుపుతుంది. ఆర్థిక సమైక్యతలో నవ శకం ఒకే దేశం- ఒకే పన్ను: జీఎస్ టీ ప్రారంభం: 2017 జూలై 1 వస్తుసేవల పన్ను (జీఎస్టి)తో దేశవ్యాప్తంగా 30 రకాల పన్నులు, సుంకాలన్నీ ఒకే పన్నుల వ్యవస్థ ద్వారా ఏకీకృత విధానం పరిధిలోకి వచ్చాయి. రాష్ట్రాల సరిహద్దులలో వేర్వేరు రకాల పన్నుల వల్ల తలెత్తే సంక్లిష్టతలను తగ్గించి, దేశాన్ని ఏకీకృత విపణి వైపు నడిపించడమే దీని లక్ష్యం. రాష్ట్రాలలో వాణిజ్య, ఇతరత్రా పన్నుల స్వరూపంపై అవగాహనలో ఇది ఎంతో సౌలభ్యం కల్పించింది. కేంద్ర, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తెస్తూ ఏర్పాటు చేసిన వస్తుసేవల పన్న ముండలి (జీఎస్టేటి కౌన్సిల్) ఈ వ్యవస్థలో కీలక భాగంగా మారింది. 'జీఎస్టి 2.0' లో భాగంగా భావితరం సంస్కరణల్లో భాగంగా ప్రధాన పన్ను శాతాలను 5, 18 గా సవరించారు. పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య : 2017 లో 66.50 లక్షలు కాగ 2026 లో 1.65 కోట్లు ఐక్యతా సూత్రం : 'ఏక్ భారత్ శ్రేష్ట భారత్' దార్శనికతను తొమ్మిదేళ్లుగా జీఎస్టి బలోపేతం చేసింది. తద్వారా 17 రకాల పన్నులు, 13 రకాల సుంకాలను ఏకైక ఉన్ముడి చట్రంలో ఏకీకృతం చేసింది. ఒకే దేశం - ఒకే ఫాస్టాగ్ ప్రారంభం: ఎలక్ట్రానిక్ విధానంలో టోల్ రుసుము వసూలు ఏకీకరణ దిశగా 2019లో ఇది ప్రారంభమైంది. తదనుగుణంగా జీతీయ రహదారులలోని బోల్ ప్లాజాల వద్ద 'ఫాస్టాగ్' వరుసలు ఏర్పాటయ్యాయి. దేశవ్యాప్తంగా రహదారులపై ప్రయాణ వేగం పెరగడమే కాకుండా నిరాటంకంగా సాగుతోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులుతీరే అవసరం లేకపోవడం సహా ఇంధనం ఆదా అవుతోంది. ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ₹3,075తో వార్షిక పాస్ సదుపాయం 2025 ఆగస్టు 15 నుంచి ప్రారంభమైంది. దీని ద్వారా ఏడాది పాటు లేదా 200 దఫాలకు మించకుండా టోల్ ప్లాజాల గుండా ప్రయాణించవచ్చు. తాజాగా ఫాస్టాగ్ పోర్టబిలిటీ సౌకర్యంతో 'వన్ ట్యాగ్'ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదారులు తను ప్రస్తుత ఫాస్టాగ్‌ను కొనసాగిస్తూనే, జారీ సంస్థను మార్చుకునే వీలుంటుంది. దీంతో వినియోగదారులకు మరింత సౌకర్యం, ఎంపిక స్వేచ్ఛ అభిస్తాయి. 98% నికి పైగా వినియోగం, దాదాపు 13 కోట్ల మంది వినియోగదారులతో దేశంలో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థను ఫాస్టాగ్ అమూలాగ్రం మార్చేసింది. ఐక్యతా సూత్రం : మీరు ఒకే ఫాస్టాగ్ ద్వారా దేశంలో ఎక్కడైనా టోల్ రుసుము చెల్లించవచ్చు. అలాగే. అనేక ప్రదేశాలలో పార్కింగ్ రుసుము కోపం కూడా వాడుకోవచ్చు. దీంతో వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు టోల్ రుసుము చెల్లించే అవస్థ తప్పడమేగాక చార్జీలలో ఏకరూపత వచ్చింది. ఆధారం : న్యూ ఇండియా సమాచార్