ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ - వ్యవస్థల ఏకీకరణ ఏ దేశమైనా సమాజమైనా పురోగమన పథంలో సాగాలంటే ఐక్యతే బలమైన పునాది. దేశ సమగ్రత సురక్షితంగా ఉండాలంటే ఐక్యత అవశ్యం. వికసిత భారత్ లక్ష్య సాధనకు ఐక్యత అత్యంత కీలకం. దేశ పౌరుల మధ్య భాష, సంస్కృతి, సంప్రదాయాల ఆదానప్రదాన సౌలభ్యం ధ్యేయంగా మొదలైన ఈ కార్యక్రమం, గడచిన దశాబ్ద కాలంలో సుపరిపాలనకు ఆత్మగా రూపాంతరం చెందింది. ఆనాడు 550కి పైగా సంస్థానాలను ఏకం చేయడంలో సర్దార్ పటేలు స్ఫూర్తినిచ్చిన ఈ దృక్పథమే నేడు పన్ను విధానం, రేషన్ పంపిణీ, పింఛన్లు, రాజ్యాంగం, పరీక్షలు, పరిశోధనల వంటి అనేకానేక రంగాలలో "ఒకే దేశం-ఒకే వ్యవస్థ" దిశగా వివిధ కార్యక్రమాలకు మూలస్తంభంగా నిలుస్తోంది. ప్రారంభం: 31 అక్టోబరు 2015 సామాజిక సంక్షేమం - ఓ సమగ్ర భద్రత వలయం ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు ప్రారంభం: 2019 ఉచిత రేషన్ సరఫరా 81 కోట్ల మందికి పైగా లబ్ది దారులు వలస కార్మికులు, స్వస్థలం వీడి మరోచోట పని చేసుకునే లబ్ధిదారులు తను రేషన్ కార్డుపై ఏ ప్రదేశంలోనైనా, ఏ దుకాణంలోనైనా సరకులు పొందే వ్యవస్థ రూపొందింది. దీంతో లబ్దిదారులు ఎక్కడికెళ్తే అక్కడ కొత్త రేషన్ కార్డు కోసం బాధలు పడాల్సిన అవస్థ తప్పింది. దీంతోపాటు దేశంలో ఎక్కడైనా తమ వంతు సరకులు తీసుకునే వీలు కలిగింది. ఆధార్ అనుసంధాన గుర్తింపు, చౌకధరల దుకాణాల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల వినియోగంతో ఈ మార్పిడి సుసాధ్యమైంది. ఐక్యతా సూత్రం : పౌరుడు ఎక్కడ ఉపాధి పొందుతున్నా, వారి ఆహాద హక్కును అక్కడే పొందగలగాలి. ఒకే ర్యాంకు- ఒకే పెన్షన్ (ఓఆర్ పీ) ప్రారంభం: 2015 ఒకే ర్యాంకు, ఒకే సేవానుభవం గల మాజీ సైనికులందరికీ సమాన పెన్షన్ చెల్లించే విధానమిది. ఒకే ర్యాంకుతో వేర్వేరు సమయాల్లో ఉద్యోగ విరమణ చేసిన సైనికుల మధ్య పెన్సన్ వ్యత్యాసాల తొలగింపు దీని లక్ష్యం. దీని ద్వారా 25 లక్షల మందికి పైగా మాజీ సైనికులు, వారి కుటుంబాలకు లబ్ధి కలిగింది. ఐక్యతా సూత్రం: పెన్షన్ విధానంలో సమానత్వం. అంకిత భావంతో దేశ రక్షణ చేసిన సైనికులపై గౌరవం, చారిత్రక మలుపు : 'ఒకే దేశం- ఒకే ఆరోగ్య బీమా' (ఆయుష్మాన్ భారత్) సమాజంలో వెనుకబడిన, అట్టడుగు, ఆర్థికంగా బలహీన వర్గాల్లోని 40 శాతం కుటుంబాలకు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో చికిత్స కోసం ఏటా 25 లక్షల విలువైన ఉచిత ఆరోగ్య బీమా రక్షణ. ఈ పథకం 2018 సెప్టెంబరులో ప్రారంభం కాగా, 2026 ఆగస్టు 12వ తేదీ వరకు 48.57 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. 13 కోట్ల మందికి పైగా లబ్దిదారులు ఆసుపత్రులలో చికిత్స పొందగా వారికి ₹2 లక్షల కోట్లకు పైగా ఆదా అయింది. వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రులలో 29.06 లక్షల మందికి పైగా రోగులకు చికిత్స కోసం ఆమోదం లభించగా, మొత్తం ₹8,800 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించింది. 'ఆయుష్మాన్ భారత్ వయో వందన యోజన' కింద 1.20 కోట్ల మంది వృద్దులు నమోదు చేసుకున్నారు. ఐక్యతా సూత్రం : వికసిత భారత్‌కు పునాది ఆరోగ్య భారత్ కాబట్టి, ఈ దిశగా దేశంలోని పౌరులందరికీ ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు సమానంగా అందాలి. ఒకే దేశం - ఒకే ఆరోగ్య కార్డు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఎ) నేతృత్వంలోని 'ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్' (ఏబీడీఎం) లో భాగంగా 'ఒకే పౌరుడు -ఒకే డిజిటల్ ఆరోగ్య రికార్డు" లక్ష్యం దిశగా గణనీయ ప్రగతి నమోదైంది. దేశంలోని ప్రతి పౌరుడికీ సురక్షిత, కాగిత రహిత, సమగ్ర డిజిటల్ ఆరోగ్య రికార్డు రూపకల్పన ఈ కార్యక్రమ లక్ష్యం. కీలక విజయాలు - గణాంకాలు: ఏబీహెచ్ఎ గుర్తింపు: ప్రతి పౌరుడికి 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యతో 96 కోట్లకు పైగా 'ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు" (ఏబీహెచ్ఎ) నమోదయ్యాయి. డిజిటల్ ఆరోగ్య రికార్డు అనుసంధానం: ఏబీహెచ్ఎ ఖాతాలతో 110 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డులు (ల్యాబ్ నివేదికలు, మందుల చీటీలు, టీకా వివరాలు, ఆసుపత్రి డిశ్చార్జ్ నివేదికలు వగైరా) సంధానితమయ్యాయి, సమ్మతి ఆధారిత సమాచార ప్రదానం: దేశంలో ఎక్కడి వైద్యులతోనైనా వ్యక్తులు స్వీయ అనుమతితో తమ మునుపటి ఆరోగ్య రికార్డులను పంచుకునే వీలుంటుంది. దీనివల్ల అనవసర పరీక్షల బెడద, కాగితపు ఫైళ్ల నిర్వహణలో ఇబ్బందులు తొలగిపోతాయి. ఐక్యతా సూత్రం : దేశంలో ఎక్కడ చికిత్స పొందినా, మీ ఆరోగ్య రికార్డులు డిజిటల్ రూపంలో అక్కడ అందుబాటులో ఉంటాయి. కేవలం ఒక్క క్లిక్‌తో వాటిని ఏ క్షణంలోనైనా పరిశీలించుకోవచ్చు. విద్య-పరీక్ష-నియామకం : యువతరం శక్తిసామర్థ్యాలు ఏకీకృతం ఒకే దేశం - ఒకే నియామక ప్రక్రియ కేంద్ర మంత్రిమండలి ఆమోదంతో 2020 ఆగస్టులో జాతీయ నియామక సంస్థ (ఎస్ఆర్ఏ) ఏర్పాటు. "ఒకే దేశం-ఒకే నియామక ప్రక్రియ" లక్ష్యం దిశగా ఇది కీలక మలుపు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు: కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో వాన్-గెజిటెడ్ (గ్రూప్ బి. సి) పోస్టులకు ప్రాథమిక పరీక్ష నిర్వహణ కోసం స్వయంప్రతిపత్తి గల సంస్థగా 'ఎస్ఆర్ఎ'' ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిసింది. ప్రధాన నియామక సంస్థల సంధానం: ప్రారంభ దశలో మూడు ప్రధాన నియామక సంస్థల ప్రాథమిక పరీక్షల స్థానంలో 'సార్వత్రిక అర్హత పరీక్ష' (సీఈటీ) ను ప్రవేశపెట్టారు. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (ఆర్ ఆర్ జీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) స్థానంలో కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఒకే దేశం- ఒకే పరీక్ష (ఎన్టీఏ) ప్రారంభం: 2017: మార్పులకు ప్రణాళిక 2026 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాటుతో సాంకేతికత ఆధారిత ఏకీకృత వ్యవస్థ ద్వారా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. వైద్య విద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో 'నీట్' (ఎన్ఈటీ) ఏకైక పరీక్షగా స్థిరీకకరణ. ఎన్టీఏ నిర్వహించే పరీక్షలు సహా పబ్లిక్ పరీక్షల సురక్షిత, సమర్ధ నిర్వహణకు తగిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం నందన్ నీలేకని అధ్యక్షతన ఉన్నతస్థాయి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఈ బృందం సంబంధిత భాగస్వామ్య సంస్థల నుంచి సూచనలు. సలహాలను ఆహ్వానించింది. మార్గదర్శక సూత్రం : రాష్ట్రం లేదా విద్యా బోర్డు పరిమితులతో నిమిత్తం లేకుండా జాతీయ పరీక్ష వేదిక ద్వారా విద్యార్థుల అవకాశాలు నిర్దేశితం కావాలి.ఒకే దేశం-ఒకే చందా (ఓఎస్ఓఎస్) ఇటీవలే ప్రారంభమైన పథకం దేశంలోని ప్రభుత్వ విద్యా- పరిశోధన సంస్థలలోని విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు జాతీయ స్థాయి చందా విధానం ద్వారా ప్రముఖ అంతర్జాతీయ పరిశోధన పత్రికల సౌలభ్యం కల్పించే లక్ష్యంతో రూపొందించిన వ్యవస్థ ఇది. ఈ పథకం కోసం మూడేళ్ల కాలానికిగాను ప్రభుత్వం బడ్జెట్లో ₹6,000 కోట్లు కేటాయించింది. మార్గదర్శక సూత్రం: సంబంధిత సంస్థల ఆర్థిక సామర్థ్యం లేదా భౌగోళిక స్థానాన్ని బట్టి జ్ఞాన సముపార్జన అవకాశం పరిమితం కాకూడదు. రాజ్యాంగపరంగా మార్పుచేర్పులు - పాలన వ్యవస్థల ఏకీకరణ ఒకే దేశం-ఒకే రాజ్యాంగం : ఆర్టికల్ 370 నుంచి విముక్తి 2019 ఆగస్టు 5: నిర్ణయాత్మక మార్పు జమ్మూ కాశ్మీర్ సంబంధిత రాజ్యాంగంలో మార్పుచేర్పుల తర్వాత 'ఒకే దేశం-ఒకే రాజ్యాంగం' భావన కొత్త కోణం సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్, అద్దాను కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడం ద్వారా కేంద్ర చట్టాలు, పాలన విధానాల అమలు వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ఐక్యతా సూత్రం : 'ఒకే దేశం-ఒకే చట్టం - ఒకే రాజ్యాంగం' కల సాకారమైంది. పౌర హక్కులు, రాజ్యాంగంలో మార్పుచేర్పులు ఉమ్మడి జాతీయ విధానంతో అనుసంధానితమయ్యాయి. ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లు: 2024 డిసెంబరు లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ యోచన. పూర్వ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన 2023 సెప్టెంబరులో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. ఆ కమిటీ సిఫారసుల మేరకు 2024 డిసెంబరులో లోక్‌సభకు రాజ్యాంగ సవరణ బిల్లు సమర్పణ. ప్రతిపాదిత విధానం ప్రస్తుత స్థితి: ఇది ఇంకా చట్టంగా రూపొందలేదు. ప్రస్తుతం సంయుక్త సభాసంఘం పరిశీలనలో ఉంది.ఐక్యతా సూత్రం: లోకసభ, శాసనసభలకు దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను సమన్వయం చేసే ప్రతిపాదన ఇది. ఎన్నికల వ్యయం తగ్గింపుతోపాటు తరచూ ఎన్నికల ప్రవర్తన నియమావళి వల్ల అభివృద్ధి పనులకు తలెత్తే అంతరాయాల తొలగింపు దీని లక్ష్యం. ఒకే దేశం- ఒకే పౌర స్మృతి ప్రస్తుతం అమలులోగల పౌర స్మృతి వాస్తవానికి వివక్షాపూరితమని ప్రధాన మంత్రి సరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోపాటు సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థిస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాతల స్వప్న సాకారం అందరి సమష్టి బాధ్యత. ఈ కీలకాంశంపై విస్తృత జాతీయ చర్చ అవశ్యం... లౌకిక పౌర స్మృతి నేటి తక్షణావసరం. దీని అమలుకు మనం ముందడుగు వేయాలి. ఐక్యతా సూత్రం: లౌకిక పౌర స్మృతి దేశాన్ని మతపరమైన వివక్ష నుంచి విముక్తం చేస్తుంది. అంతేకాకుండా సామాన్యులలో పరాయీకరణ భావన తొలగి, ఐక్యత ఇనుమడించడం ద్వారా "ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి బలపడుతుంది. రోడ్డు-రైలు మార్గాలు, ఇంటర్నెట్ : దూరం తగ్గింపు నుంచి సమాచార ప్రదాన సౌలభ్యం దాకా ఒకే దేశం ఒకే గుర్తింపు - ఆధార్ బయోమెట్రిక్, జనాభా సంబంధిత సమాచారం ప్రాతిపదికగా డిజిటల్ గుర్తింపును జారీచేసే ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ వ్యవస్థ.ఈ డిజిటల్ గుర్తింపుతో యూపీఐ, డిజిలాకర్, ఉమంగ్ యాప్, ఇ-సైన్ వంటి అనేక జాతీయ సేవలు అనుసంధానితమయ్యాయి.144 కోట్లకు పైగా ఆధార్ (ఒకే దేశం ఒకే గుర్తింపు) సంఖ్యలు జారీ అయ్యాయి. ఒకే దేశం-ఒకే విద్యుత్ గ్రిడ్ లేహ్ లద్దాక్ అనుసంధానంతో 2019 ఫిబ్రవరిలో 'ఒక! దేశం-ఒకే విద్యుత్ గ్రిడ్-ఒకే ఫ్రీక్వెన్సీ' లక్ష్యం నెరవేరింది.ఇది ఒకే ఫ్రీక్వెన్సీపై పనిచేసే ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ గ్రిడ్ ఇందులో 1.70 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ ప్రసార లైన్లను అదనంగా జోడించారు.ఈ మేరకు 1.12 లక్షల మెగావాట్ల విద్యుత్ ప్రసార సామర్థ్యం సమకూరింది. దేశంలోని ప్రతి ప్రాంతానికి అవసరాల మేరకు నిరంతర విద్యుత్తు సరఫరాపై భరోసా ఇవ్వడమే కాకుండా ప్రసార నష్టాలను కూడా తగ్గించారు. ఒకే దేశం ఒకే గ్యాస్ గ్రిడ్ ఇంటింటికీ యెల్ పి జి , వాహనాలకు సీఎన్ జీ ఇంధనాలను నిరంతరం అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యం.దేశంలో 2014 కు ముందు 27 ఏళ్లలో 15,000 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్లు మాత్రమే వేశారు.ఆ తర్వాత దేశవ్యాప్తంగా 34,233 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేయడం కోసం వివిధ సంస్థలకు అనుమతి జారీ అయింది. ఇందులో 2025 జూన్ నాటికి 25,429 కిలోమీటర్ల పైప్ లైన్లు వినియోగంలోకి వచ్చాయి.గ్యాస్ లభ్యత, కనెక్షన్లు పెరగడంతో అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ రహితంగా మారాయి. ఒకే దేశం- ఒకే ప్రయాణ కార్డు దేశవ్యాప్తంగా మెట్రో వ్యవస్థలు, బస్సులు, క్యాబ్‌లు, మోనో రైళ్లు సహా అన్ని పట్టణ రైల్వే నెట్ వర్క్ లలో వినియోగం దిశగా 'నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు' (ఎన్సీఎంసీ)ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.రవాణా సౌలభ్యం దిశగా 2019 మార్చి నెలలో 'ఒకే దేశం -ఒకే కార్డు' కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 'ఎన్సీఎంసీ' ప్రాతిపదికగా దేశంలో తొలిసారి స్వదేశీ స్వయంచలిత చార్జీల వసూలు వ్యవస్థ (ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్) రూపొంచింది.మెట్రో, బస్సు, సబర్బన్ రైలు, టోల్ ప్లాజాలు, పార్కింగ్, స్మార్ట్ సిటీ సేవలు, చిల్లర కొనగోళ్లు సహా అన్ని రంగాల్లో చెల్లింపులకు ప్రజలు ఈ కార్డును వాడుకోవచ్చు. అనుసంధానం దిశగా రోడ్డు- రైలు. జాతీయ రహదారి, డిజిటల్ వ్యవస్థలు రోడ్లు, జాతీయ రహదారులు దేశ రహదారి నెట్వర్క్ 63.73 లక్షల కిలోమీటర్లతో ప్రపంచంలో రెండో అతిపెద్ద వ్యవస్థగా గుర్తింపు పొందింది.జాతీయ రహదారుల పొడవు 2013-14 లో 91,287 కి.మీ కాగ 2026 లో 1,46,572 కి.మీ. పెరుగుదల సుమారు 61% రైలు సర్వీసులు భారతీయ రైల్వే 2026 ఆగస్టులో 67.27 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది.భారత బ్రాడ్ గేజ్ రైల్వే నెట్‌వర్క్‌లో 99.6 శాతం విద్యుదీకరణ పూర్తయింది.ముంబయి-అహ్మదాబాద్ మధ్య 508 కి.మీ. హై-స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం సాగుతోంది. గంటకు 350 కి.మీ. వేగంతో రైళ్లు దూసుకెళ్లేలా ఈ మార్గం రూపొందుతోంది.తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు 2026 జూలైలో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 162 వందే భారత్, 2 వందే భారత్ స్లీపర్, 72 అమృత్ భారత్ రైళ్ల ద్వారా అనుసంధానం, ప్రయాణ సౌలభ్యం ఎంతో మెరుగైంది. డిజిటల్ అనుసంధానం దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 109.2 కోట్లు దాటింది. వైర్లెస్ డేటా ఒక జీబీ ధర ₹7.51 స్థాయికి దిగివచ్చింది.భారత్ నెట్ ప్రాజెక్ట్: దేశంలోని పంచాయతీల అనుసంధానం లక్ష్యంగా చేపట్టిన ఈ పథకంలో భాగంగా ఇప్పటిదాకా 2.21 లక్షలకు పైగా పంచాయతీల్లో సేవల ప్రదానానికి రంగం సిద్ధమైంది.ఫైబర్ 5జీ నెట్ వర్క్ లు: దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు వేయగా, 99.9 శాతం జిల్లాల్లో 5జీ సేవలు నేడు లభ్యమవుతున్నాయి. ఐక్యతా సూత్రం: దేశంలో ఎవరెక్కడ నివసిస్తున్నా-జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, హై-స్పీడ్ రైళ్లు ఆయా ప్రాంతాలు, సంస్కృతుల మధ్య నేడు ప్రయాణ సౌలభ్యం కల్పిన్నాయి. అలాగే, డిజిటల్ అనుసంధానం దూరాలను తగ్గించగా, గ్రామాలు కూడా ఫైబర్ నెట్ వర్క్ ద్వారా సంధానితమయ్యాయి. అన్నదాతకు సాధికారత - గ్రామాలు, రైతుల కోసం సమీకృత వ్యవస్థ ఒకే దేశం ఒకే ఎరువు - 'భారత్' బ్రాండుతో నవ శకారంభం భారతీయ జన ఉర్వరక్ పరియోజన (భారత్ ప్రజాః: ఎరువుల పథకం) కింద 'ఒకే దేశం, ఒకే ఎరువు' ఇతివృత్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022 అక్టోబర్ 17న 'భారత్' బ్రాండు యూరియాను మార్కెట్ ప్రవేశం చేయించారు.ఈ మేరకు దేశవ్యాప్తంగా ఒకే పేరు, ఒకే నాణ్యత ప్రమాణం, ఒకే బ్రాండు లో భాగంగా ''భారత్' యూరియా' రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఒకే దేశం ఒకే వ్యవసాయ మార్కెట్ దేశంలో ఎక్కడైనా రైతు తన పంటను విక్రయించుకోగలిగేలా 'జాతీయ వ్యవసాయ మార్కెట్' (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) లేదా ఇ-నామ్' 2016 ఏప్రిల్‌లో ప్రారంభమైంది. తద్వారా 'ఒకే దేశం-ఒకే వ్యవసాయ మార్కెట్' వైపు దేశం ముందడుగు వేస్తోంది.దేశవ్యాప్తంగా 1.80 కోట్ల మందికి పైగా రైతులు, 2.73 లక్షల మంది వ్యాపారులు 'ఇ-నామ్' పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు..అలాగే 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1,656 వ్యవసాయ మార్కెట్లు (మండలు) 'ఇ-నామ్' వేదికతో అనుసంధానితమయ్యాయి.ఇ-నామ్ ప్రారంభం నుంచి 2026 మార్చి వరకూ ₹4.84 లక్షల కోట్లకు పైగా విలువైన 205 లక్షల టన్నుల వ్యవసాయోత్పత్తుల క్రయవిక్రయాలను నిర్వహించారు. ఆధారం: న్యూ ఇండియా సమాచార్