ఆధార్ అంటే ఏమిటి ఆధార్ అనేది పన్నెండు అంకెలు గల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. భారత ప్రభుత్వం తరపున దీనిని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేస్తుంది. వ్యక్తిగత గుర్తింపు, చిరునామాలకు భారతదేశంలో ఎక్కడైనా ఈ సంఖ్య ఆధారంగా పనికివస్తుంది. ఆధార్ లెటర్ భారతీయ తపాలా శాఖ ద్వారా బట్వాడా అయినా లేక ఇంటర్నెట్ లో యు.ఐ.డి.ఎ.ఐ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకున్న ఇ-ఆధార్ కూడా సమానమైన యోగ్యత కలిగినవి. ఈ-ఆధార్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటన ఈ- ఆధార్ యొక్క యోగ్యతపై ఆఫీస్ మెమొరాండం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పేర్కొన్న తనిఖీ ప్రక్రియకు లోబడి, భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తి ఆధార్ కోసం ఉచితంగా ఒకసారి నమోదు చేసుకోవచ్చు. ప్రతీ ఆధార్ సంఖ్య ప్రతి వ్యక్తికీ విశిష్టమైనది, ఆ వ్యక్తి జీవిత కాలానికి విలువైనది. బ్యాంకింగ్, మొబైల్ ఫోన్ కనెక్షన్లు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలను పొందేందుకు ఆధార్ మీకు సహకరిస్తుంది. ఆధార్ ఎలా ఉంటుందంటే: ఆన్లైన్లో సులభంగాను, ఉచితంగానూ తనిఖీ చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు సమాచార నిధులలో ఎక్కువ సంఖ్యలో ఉన్న డూప్లికేట్, ఫేక్ గుర్తింపులను తొలగించగలిగే విశిష్టత మరియు సత్తా కలిగినది. ఆధార్ తమాషాగా ఉత్పత్తి చేయబడే సంఖ్య. ఇది కుల, జాతి, మత, భౌగోళిక విభాగాలను సూచించేది కాదు. ఆధార్ ఎందుకు ఆధార్ ఆధారిత గుర్తింపు రెండు రకాల విశిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. విశ్వీకరణ అనేది నిర్ధారింపబడింది.: ఎందుకంటే కొంతకాలంలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని రకాల సేవలను పరిగణలోకి తెస్తుంది. ఈ సంఖ్య పొందడానికి ప్రతి నివాసికి అధికారం ఉంది. ఒకసారి ఈ సంఖ్య సృష్టింపబడిన తర్వాత అది ఒక వ్యక్తికి సాధారణ, విశ్వవ్యాప్తీకృత గుర్తింపును ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్లు, సంస్థలు వారి సొంత గుర్తింపు ఆధారిత అప్లికేషన్లు రూపొందించడానికి ఈ సంఖ్య ఉపయోగపడుతుంది. భా. వి. గు. ప్రా. సం. దేశవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్లందరిలో నివాసులందరికీ ఈ సంఖ్య వచ్చేందుకు భాగస్వామ్యాన్ని నెలకొల్పుకొంటుంది. అటువంటి రిజిస్ట్రార్లలో రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, టెలికాం కంపెనీలు మొదలైనవి ఉంటాయి. ఈ రిజిస్ట్రార్లు నివాసులందరుకీ ఆధార్‌ను నమోదు చేయించడానికి నమోదు ఏజెన్సీలతో భాగస్వామ్యం కలిగి ఉంటారు. ఆధార్ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, నివాసితుల మధ్య నమ్మకాన్ని పెంపొందించుకొనేందుకు ప్రయత్నిస్తుంది. నివాసితులు ఆధార్ కోసం నమోదు చేసుకున్నాక వారికి సంబంధించిన “మీ వినియోగదారున్ని గురించి తెలుసుకోండి” అనే సమాచారం కోసం సర్వీసు ప్రొవైడర్లు వేచి ఉండక్కర్లేదు. గుర్తింపు పత్రాలు లేవన్న కారణంతో నివాసితులకు తమ తమ సేవలను తిరస్కరించనవసరం లేదు. బ్యాంక్ అకౌంట్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు... మొదలైన సేవలను పొందడానికి ప్రతిసారి తమ గుర్తింపు పత్రాలను చూసి గుర్తింపును నిరూపించుకోవల్సిన సమస్యను నివాసులు అధిగమించవచ్చు. బ్యాంకులు తదితర సేవలను ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగాల నుంచి పొందాలనుకొనే పేద, నిరుపేద నివాసితులను ఆధార్ శక్తివంతులను చేస్తుంది. భా. వి. గు. ప్రా. సం. వద్ద గల కేంద్రీకృత సాంకేతిక పరిజ్ఞానం ఒక నివాసికి సంబంధించిన సమాచారాన్ని “ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఎలా కావాలో అలా – అవసరానికి అనుగుణంగా” ధృవీకరిస్తుంది. తరచూ చిరునామా మార్చుకొనే సంచార జీవులకు ఆధార్ చరనివాస గుర్తింపునిస్తుంది. ఆధార్ సంఖ్య ధృవీకరణ ఆన్లైన్, ఆఫ్‌లైన్ అన్న రెండు పద్ధతుల ద్వారాను పొందవచ్చు. మూలప్రాంత నివాసులు తమ ఆధార్ గుర్తింపును తమ వద్దనున్న సెల్‌ఫోన్ ద్వారా గానీ, ల్యాండ్‌లైన్ ద్వారా గానీ నిర్ధారణ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఆధార్‌తో అనుసంధానించబడ్డ గుర్తింపు తనిఖీ పేదలు, గ్రామీణ నివాసులకు ఎటువంటి వెసులుబాటును ఇస్తుందో బ్యాంకింగ్ మరియు రిటైల్ సేవలు పొందడంలో పట్టణ ప్రాంత మధ్య, ఎగువ తరగతుల వారికి అటువంటి వెసులుబాటునే ఇస్తుంది. ఆధార్ నమోదుకు ముందు సరైన రీతిలో తనిఖీని కోరుతుంది. చేర్పిడికి ముందు సమాచారాన్ని నిర్ధారించుకొంటుంది. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న నివాసుల గుర్తింపు సంబంధిత సమాచార నిధులు డూప్లికేట్లతో, అయోగ్యమైన లబ్దిదారులతో తప్పుల తడకలుగా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు లేకుండా భా. వి. గు. ప్రా. సం. తమ సొంత సమాచార నిధులలోకి నివాసుల సమాచారాన్ని తనిఖీ చేసి వారి డెమోగ్రఫిక్ మరియు బయోగ్రఫిక్ సమాచారాలతో సహా నమోదు చేస్తుంది. ఈ పథకం ప్రారంభం నుంచి సేకరించిన సమాచారం ఖచ్చితమైనవని నిర్ధారణ చేయడానికి వీలుగా సమాచారం సేకరించబడుతుంది. అయితే పేద, నిరుపేద జనాభాకు తమ గుర్తింపుకు సంబంధించిన పత్రాలు లేకపోవడం వల్ల ఆధారే వారికి మొదటి గుర్తింపు పత్రంగా నిలుస్తోంది. ఇలా తమ స్వీయ గుర్తింపు పత్రాలు లేని పేదల వివరాలను నమోదు చేయడానికి వీలుగా భా. వి. గు. ప్రా. సం. “పరిచయస్తుల” పద్ధతి ఏర్పాటు చేసి “మీ నివాసి గురించి తెలుసుకోండి” అనే ప్రమాణాలను నెలకొల్పింది. ఈ పద్ధతి ద్వారా, గుర్తింపు పత్రాలు కలిగి ఎవరైతే ముందుగా ఆధార్ కలిగి ఉన్నారో వారు ఎటువంటి గుర్తింపు పత్రాలు లేనివారిని పరిచయం చేస్తూ వారికి ఆధార్ నంబర్‌ను వచ్చేలాగా సహకరించవచ్చు. ఇటువంటి ఆధీకృత వ్యక్తులను “పరిచయస్తులు” అంటున్నారు. ఆధారము: యుఐడిఎఐ